పెండింగ్ కేసులు లేకుండా చూడాలి
డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి
బంట్వారం: పెండింగ్ కేసులు లేకుండా చూడాలని వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన కోట్‌పల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పెండింగ్ కేసులు తదితర అంశాలపై చర్చించి మాట్లాడారు. నేరాల నియంత్రణకు రాత్రి వేళ గస్తీ ముమ్మరం చేయాలన్నారు. శాంతి భద్రతలను కాపాడటంలో ముందు వరుసలో ఉండాలన్నారు. అసాంఘిక శక్తులపై నిఘా పటిష్టం చేయాలని ఆయన సూచించారు. రోడ్డు ప్రమాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ధారూరు సీఐ రఘురాములు, కోట్‌పల్లి ఎస్‌ఐ స్రవంతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment