ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి
తాండూరు టౌన్: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ప్రైవేటు పాఠశాల, కళాశాల యాజమాన్యాల అసోసియేషన్ తరఫున పోలీసు శాఖకు 25 ట్రాఫిక్ బారికేడ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభా, వాహనాల దృష్ట్యా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను కొందరు వాహనదారులు ఉల్లంఘించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మైనర్లు, లైసెన్స్ లేని వారు, మద్యం తాగి వాహనాలు నడపడాన్ని అరికడతామని వెల్లడించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో వినియోగించే బారికేడ్లను పాఠశాల, కళాశాలల యాజమాన్య సభ్యులు పోలీసు శాఖకు అందజేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాల, కళాశాల యాజమాన్య సభ్యులు రంగారావు,నరేందర్, సంగీత, రామకృష్ణ, కిరణ్, సతీష్, శివ, రవీందర్ రెడ్డి, మోహన కృష్ణ, యూనుస్, అభిలాష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కవిత, కల్పన, వాహిద్, సలీం తదితరులు పాల్గొన్నారు.
తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment