సీసీ రోడ్డు పనులు ప్రారంభం
ధారూరు: వ్యవసాయ మార్కెట్‌లో సీసీ రోడ్ల నిర్మాణాన్ని మంగళవారం ధారూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ ఉపాధిహామీ పథకం నుంచి మంజూరైన రూ.30లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. మార్కెట్ మెయిన్ రోడ్డు నుంచి వ్యవసాయ కార్యాలయం వరకు రూ.10లక్షలు, ఏఎంసీ కార్యాలయం కార్యాలయం నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు రూ.10లక్షలు, ఏఎంసీ దుకాణాల సముదాయం ఎదుట రూ.10లక్షలు కేటాయించారని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాన్‌సింగ్, ధారూరు పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్లోళ్ల రాములు, ఏఎంసీ కార్యదర్శి సిద్దమ్మ, డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాగా కుక్కింద గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో నిర్మించే సీసీ రోడ్డు పనులను పట్లోళ్ల రాములు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment