రైతుల సంక్షేమానికి కృషి
● అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు అందుతాయి ● దోమ పీఏసీఎస్ చైర్మన్‌ప్రమాణా స్వీకారంలో ఎమ్మెల్యే టీఆర్‌ఆర్
దోమ: రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దోమ పీఏసీఎస్ కార్యాలయంలో నూతన చైర్మన్‌గా ఆగికాల యాదవరెడ్డితో అధికారులు ప్రమాణా స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. జిల్లాలో రూ.300 కోట్ల పంట రుణాలను మాఫీ చేశామని తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా ఎకరాకు రూ.15 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం ఇస్తుందన్నారు. భూమి లేని రైతులకు ఏడాదికి రూ.12 వేలు, పెన్షన్లు, అర్హులకు రేషన్ కార్డులు, సన్నరకం బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
భగ్గుమన్న వర్గపోరు
పీఏసీఎస్ చైర్మన్ ప్రమాణా స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఒక వర్గానికి చెందిన నేతల ఫొటోలు ఉండటంతో మరో వర్గం ఆందోళనకు దిగింది. తమ ఫొటోలు ఎందుకు పెట్టలేదని ఫ్లెక్సీని చింపేశారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. నాయకులు కలుగజేసుకొని ఫ్లెక్సీ చింపిన వారిని అక్కడి నుంచి పంపేశారు. కాసేపటికి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పీఏసీఎస్ కార్యాలయానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్లెక్సీ చింపిన వర్గం అక్కడికి వచ్చి ఆందోళనకు దిగారు. పార్టీలో తమకు సముచిత స్థానం లేదంటూ మరో ఫ్లెక్సీని చింపేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తాము ఎంతో కృషి చేశామని, ఓట్లు వేసిన పాపానికి తమను అరెస్టు చేశారని పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుల మధ్య సమన్వయ లోపం ఉందని, ఎమ్మెల్యే పరిస్థితులను చక్కబెట్టాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మాలి విజయ్‌కుమార్‌రెడ్డి, పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, పీఏసీఎస్ వైస్ ప్రసిడెంట్ బసన్నగౌడ్, డెరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వెంకటయ్య, శేఖరయ్య, భాస్కర్, మల్లేశ్, కిష్టమ్మ, ఏఎంసీ డైరెక్టర్లు శాంతుకుమార్, ప్రభాకర్‌రెడ్డి, అనంతయ్య, నర్సింహులు, పార్టీ సీనియర్ నాయకులు అంతిరెడ్డి, రాఘవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment