కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలి
● అన్ని శాఖలతో పోలీస్ శాఖను పోల్చుకోవద్దు ● శాంతిభద్రతల పరిరక్షణ నిరంతర ప్రక్రియ ● ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం: శాంతిభద్రతలను పరిరక్షించడం నిరంతర ప్రక్రియ అని, అన్ని ప్రభుత్వశాఖల పనితీరుతో పోలీసు శాఖను పోల్చుకోవద్దని రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ బి.శివధర్‌రెడ్డి సూచించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని ఆక్టోపస్ ఆవరణలో 3వ బెటాలియన్ (టీజీఎస్‌పీ)లో తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 288 మంది స్పెషల్ పోలీసులతో శుక్రవారం నిర్వహించిన 4వ బ్యాచ్ దీక్షాంత్ పరేడ్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోనే మంచి పేరున్న తెలంగాణ పోలీసు శాఖలోకి వస్తున్నారని, బాధ్యతాయుతమైన పోలీసులుగా మీ కర్తవ్యం, బాధ్యతలు, విధులను సక్రమంగా నిర్వర్తిస్తారని ఆకాంక్షించారు. అన్ని శాఖల మాదిరిగా కాకుండా హక్కులు, స్వేచ్ఛలు పోలీసు శాఖకు పరిమితంగా ఉంటాయని తెలిపారు. కొత్తగా వెలుగు చూస్తున్న నేరాలు, శాంతి భద్రతల అంశం ప్రస్తుం సవాల్‌గా మారుతున్నాయని అన్నారు. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మీరు తీసుకున్న శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఉన్నతాఽధికారులు ఇచ్చే ఆదేశాలను తప్పనిసరి పాటించాలని సూచించారు. యూనిఫాం వేసుకొని విధులు నిర్వర్తించే వారిని సమాజం వెయ్యి కళ్లతో చూస్తుంటందని గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో టీజీఎస్‌పీ 3వ బెటాలియన్ కమాండెంట్ సయ్యద్ జమీల్‌బాష, ఐఆర్‌ఎస్ అధికారి ప్రసాద్, మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, రిటైర్డ్ పోలీసు అధికారులు, శిక్షణ పొందిన కానిస్టేబుల్స్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment