నేడు మర్పల్లికిస్పీకర్ ప్రసాద్‌కుమార్
మర్పల్లి: మండలంలో శనివారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పర్యటించనున్నట్లు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జగదీశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యా హ్నం ఒంటి గంటకు మర్పల్లి వ్యవ సాయ మార్కెట్ కమిటీ ఆవరణలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారని తెలిపారు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేస్తారని పేర్కొన్నారు. తుమ్మలపల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభిస్తారని తెలిపారు.
ఆయిల్‌పాం సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం
ఆయిల్‌పాం శాస్త్రవేత్త, జిల్లా ఇన్‌చార్జ్ రంగనాయక్
మోమిన్‌పేట: ఆయిల్‌పాం తోటల పెంపకానికి రైతులు ముందుకు రావాలని ఆయిల్‌పాం శాస్త్రవేత్త, జిల్లా ఇన్‌చార్జ్ రంగనాయక్ సూచించారు. శుక్రవారం మోమిన్‌పేట రైతు వేదికలో అన్నదాతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆయిల్‌పాం సాగుకు ప్రభుత్వం 90శాతం సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. మొక్కలు మొదలుకొని ఎరువులు, డ్రిప్ పరికరాలు ఇస్తున్నట్లు చెప్పారు. ఆయిల్‌పాం తోటల్లో అంతర పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చని అన్నారు. పంట సాగు చేసిన నాలుగేళ్ల నుంచి కోతకు వస్తుందన్నారు. నీరు పుష్కలంగా ఉంటే 30 సంవత్సరాల పాటు దిగుబడి పొందవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఈఓలు పెంటయ్య, చంద్రిక, రైతులు పాల్గొన్నారు.
పంట వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి
జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి
యాలాల: యాసంగి సీజన్‌లో సాగు చేసిన పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి రైతులకు సూచించారు. శుక్రవారం మండలంలోని జక్కేపల్లి శివారులోని పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. పంటలు సాగు చేసే రైతులు తప్పని సరిగా వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. ఆయన వెంట అగ్గనూరు క్లస్టర్ ఏఈఓ గోపి ఉన్నారు.
అడవులను
రక్షించుకుందాం
డీఎఫ్‌ఓ జ్ఞానేశ్వర్
అనంతగిరి: అడవుల రక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అటవీశాఖ జిల్లా అధికారి జ్ఞానేశ్వర్ సూచించారు. గురువారం వికారాబాద్ సమీపంలోని ఫారెస్టు కార్యాలయంలో అటవీశాఖ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలతో ముందుకు సాగాలన్నారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నర్సరీల నిర్వహణ, ప్లాంటేషన్‌కు ఎలా సన్నద్ధం అవుతున్నారనే విషయాలపై ఆరా తీశారు. అటవీ ప్రాంత సమీపంలో పంటలు సాగు చేసే రైతులు పంట కోతల అనంతరం వ్యర్థాలను కాలుస్తుంటారని అలాంటి సమయంలో అడవులు అగ్ని ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ అడవులను ప్రమాదాల నుంచి కాపాడుకోవాలని సూచించారు. అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓలు, ఎఫ్‌ఎస్‌ఓలు, ఎఫ్‌బీఓలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment