రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణపై మరింత నిఘా పెట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు ఆయా గ్రామాల్లో పర్యటించి రికార్డుల నిర్వహణ, కార్యదర్శుల పనితీరుపై సమీక్ష నిర్వహించాలని అన్నారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి, గ్రామీణ పాలన అంశంపై జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి, గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ శ్రీలతతో కలిసి ఎంపీడీఓలు, ఏపీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే పంచాయతీ కార్యదర్శులను ఉపేక్షించొద్దని, తరచూ విధులకు గైర్హాజరయ్యే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, పా ర్కులు, విద్యుత్ దీపాలు, తాగునీటి సరఫరా నిర్వ హణపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. వైకుంఠధామాల చుట్టూ కంచెలు నిర్మించి, మొక్కులు నాటాలని సూచించారు. నాటిన మొక్కలకు విధిగా నీరు అందించాలని, 18 ఏళ్లు పైబడిన వారికి జాబ్‌కార్డులు అందజేయాలని, ఏప్రిల్ ఒకటి నుంచి మే 31 వరకు 70 శాతం కూలీలను మొబిలైజ్ చేసుకోవాలన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మలో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. ప్రతి అప్లికేషన్‌ను పరిశీలించి రీ–వెరిఫికేషన్ కోసం ఉన్నతాధికారులకు పంపించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment