నాగిరెడ్డిపల్లిని అభివృద్ధి చేద్దాం
బొంరాస్‌పేట: ‘బడి, గుడి సమానం.. మన ఊరిని అభివృద్ధి చేద్దాం.. అధికారులకు సమష్టిగా సహకరింకరించాలి’.. అంటూ కడా అధికారి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లిని సందర్శించారు. గ్రామంలోని జాతీయ రహదారి–163కు ఆనుకుని ప్రాథమికోన్నత పాఠశాలను పరిశీలించారు. కాగా రహదారికి సమీపంగా ఉన్న పాఠశాలకు మరో చోట నూతన భవనం మంజూరు చేయాలని గ్రామస్తులు విన్నవించారు. ఈ మేరకు ఆయన వెంటనే మరో చోట పాఠశాల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. గ్రామంలోని కమ్యూనిటీ హాలు స్థలంలో పాఠశాల భవనం నిర్మించాలని తీర్మానించారు. నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని గ్రామస్తులకు తెలిపారు.
దేవాలయం పరిశీలన
గ్రామ శివారులోని గుట్టపై ఉన్న పార్వతి పరమేశ్వర దేవస్థానాన్ని పరిశీలించారు. జాతీయ రహదారి నుంచి దేవస్థానం వరకు సీసీరోడ్డు, కల్యాణమండపం నిర్మించాలని గ్రామస్తులు, దేవాలయ కమిటీవారు విన్నవించారు. అందుకు స్థల పరిశీలన చేసి నిధులు మంజూరు చేస్తామని కడా అధికారి వెంకట్‌రెడ్డి చెప్పారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నర్సింలుగౌడ్, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్, నాయకులు నర్సింలు, వెంకటయ్య, ఎల్లప్ప, బాబు, రాజు ఉన్నారు.
కడా అధికారి వెంకట్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment