మద్యం తాగేందుకు రూ.100 ఇవ్వలేదని..
● బావిలో దూకి పశువుల కాపరి ఆత్మహత్య ● తాండూరు మండలం కరన్‌కోట్‌లో ఘటన
తాండూరు రూరల్: మద్యం తాగేందుకు యజమా ని డబ్బులు ఇవ్వలేదని మనస్తాపానికి గురైన ఓ పశువుల కాపరి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తాండూరు మండలం కరన్‌కోట్‌లో గురువారం వెలుగుచూసింది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పోలేపల్లి నరేశ్ (23) ఇదే ఊరికి చెందిన కొడంగంటి రాములు వద్ద పశువుల కాపరిగా పని చేస్తున్నాడు. ఐదు రోజుల క్రితం తనకు జీతం డబ్బులు ఇవ్వమని రాములును అడగగా.. తాగి వృథా చేస్తాడనే ఉద్దేశంతో తిరస్కరించాడు. ఈ విషయాన్ని సురేశ్ తన సోదరుడు లక్ష్మప్ప, బాబాయి వెంకటప్పకు చెప్పడంతో గత నెల 30న యజమాని నుంచి రూ.3,500 ఇప్పించారు. అనంతరం కొత్త సంవత్సరం సందర్భంగా గత బుధవారం తనకు రూ.100 ఇవ్వమని సురేశ్ యజమానిని అడిగాడు. డబ్బులిస్తే.. మద్యం తాగి పశువులు కాసేందుకు వెళ్లడని భావించిన రాములు తన వద్ద లేవని చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన సురేశ్ గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు రాత్రి 9గంటలకు బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం అనంతరం గురువారం ఉదయం సురేశ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సురేశ్‌కు వివాహం కాలేదు. తల్లి, సోదరుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment