క్రీడా రంగానికి ప్రోత్సాహం
కడ్తాల్: రాష్ట్రంలో క్రీడా రంగాన్ని ప్రోత్సాహించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీల ఏర్పాటుకు కృషి చేస్తోందని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి అన్నారు. మండల కేంద్రంలో గూడూరు నారాయణరెడ్డి స్మారకార్థం ఆయన కుమారుడు జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. యువత క్రీడ ల్లో రాణించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు. వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చే విధంగా ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తోందని అన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ చైర్ పర్సన్ గీత, వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీచ్యానాయక్, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి
Comments
Please login to add a commentAdd a comment