అర్హులందరికీ రేషన్ కార్డులు
అనంతగిరి: అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని, కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ సభలు, వార్డు కార్యాలయాలు, ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు పరిశీలించి అర్హులకు రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. కుటుంబంలో విభజన అయిన వారు కొత్త కార్డు కోసం చేసుకున్న దరఖాస్తును కూడా పరిశీలిస్తామన్నారు. పెండింగ్ వాటిని కూడా పరిశీలిస్తామన్నారు. గతంలో అర్జీలు ఇవ్వని వారు కూడా దరఖాస్తు చేసుకొవచ్చని తెలిపారు. ఇంటి కోసం దరఖాస్తు చేసుకొని ప్రజాపాలన ఆన్‌లైన్‌లో పేర్లు రాని వారు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
ఆకస్మిక తనిఖీ
ప్రభుత్వ పథకాల అమలుకు చేపట్టిన సర్వే ప్రక్రియను ఆదివారం కలెక్టర్ ప్రతీక్‌జైన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వికారాబాద్ మండలం ధన్నారం, పూడూరులో పర్యటించారు. రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సర్వే వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు. త్వరితగతిన ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని ఆదేశించారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభ్యులు నిర్వహించి ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మండల స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో అర్హుల జాబితాను చదవి వినిపించాలన్నారు. గ్రామ సభ ఆమోదం మేరకు లబ్ధిదారుల వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేస్తామన్నారు. 26న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలుకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు సంక్షేమ ఫలాలు అందాలి
పూడూరు: ప్రజాపాలన దరఖాస్తులను పకడ్బందీగా పరిశీలించి అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రజాపాలన దరఖాస్తు పరిశీలనలో భాగంగా పూడూరులో ఇంటింటికి తిరిగి రేషన్‌కార్డుల సర్వేను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ భరత్‌గౌడ్, ఎంపీడీఓ పాండు, పంచాయతీ కార్యదర్శి మురళీకృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
కలెక్టర్ ప్రతీక్ జైన్
Comments
Please login to add a commentAdd a comment