రైతు భరోసాకు రూ.7 వేల కోట్లు
పరిగి: సాగుకు యోగ్యమైన భూములకే రైతు భరోసా పథకం అమలవుతుందని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం పరిగి పట్టణంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి అన్ని పథకాలు అమలవుతాయని తెలిపారు. జిల్లాలో సాగు భూమి 5,84,000 ఎకరాలు ఉందని ఒక్కో ఎకరాకు రూ.12వేలు చొప్పున మొత్తం రూ.7వేల కోట్లు అన్నదాతల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ పథకం వర్తిస్తుందని తెలిపారు. రేషన్ కార్డుల కోసం గ్రామాల్లో పరిశీలన కొనసాగుతోందని చెప్పారు. నియోజకవర్గానికి కొత్తగా 7,779 రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉందన్నారు. 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు. అర్హులకు ఇళ్లు మంజూరయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, ఆయ మండలాల పార్టీ అధ్యక్షులు విజయ్‌కుమార్‌రెడ్డి, సురేందర్, నాయకులు బంగ్ల యాదయ్యగౌడ్, జగన్, రామకృష్ణారెడ్డి, రాజపుల్లారెడ్డి, చిన్న నర్సింహులు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
సాగుకు యోగ్యమైన భూములకే పథకం
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment