నేటి ప్రజావాణి రద్దు
అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలపై క్షేత్రస్థాయి పరిశీలన ఉన్నందున సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సోమవారం కలెక్టరేట్‌కు రాకూడదని ఆయన కోరారు.
హక్కుల కోసం నిరంతరం పోరాడుతాం
ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జ్ సుభాష్
దోమ: మాదిగల హక్కుల కోసం నిరంతరం పోరాడుతామని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జ్ సుభాష్ అన్నారు. ఆదివారం దోమ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల నూతన అధ్యక్షుడిగా దిర్సంపల్లికి చెందిన బందయ్య, ఉపాధ్యక్షుడిగా బొంపల్లికి చెందిన డి.వెంకటేశ్, కార్యదర్శిగా రాపోల్ వెంకట్, వర్కింగ్ ప్రసిడెంట్‌గా దోమ గ్రామానికి చెందిన ఇక్కి రాములు, అధికార ప్రతినిధిగా వెవెంకటేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాదిగ హక్కుల కోసం వచ్చే నెల 7న హైదరాబాద్‌లో లక్ష డప్పులు.. వేల గొంతులు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నేతలు రాఘవాపురం రాములు, తెలంగాణ ఉద్యమకారుడు రామన్న మాదిగ తదితరులు పాల్గొన్నారు.
సర్వే పకడ్బందీగా నిర్వహించండి
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్
కొడంగల్ రూరల్: రైతు భరోసా, కొత్త రేషన్‌కార్డుల కోసం చేపట్టిన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అధికారులు, సిబ్బందికి సూచించారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన సర్వే ప్రక్రియను పరిశీలించారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించారు. సాగుకు యోగ్యమైన భూములకు రైతుభరోసా సాయం అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయకుమార్, మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ముదిరాజ్‌లను బీసీ ఏలోకి మార్చాలి
ముదిరాజ్ చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్
పరిగి: ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏలోకి చేర్చాలని ముదిరాజ్ చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ ముదిరాజ్ అన్నారు. ముదిరాజ్ ప్రజా చైతన్య యాత్ర ఆదివారం పరిగి పట్టణానికి చేరుకుంది. ప్రధాన కూడలిలోని పండుగల సాయన్న విగ్రహానికి పూలమాల నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపాదికన అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజ్‌లకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న తాము అన్ని రకాలుగా అణచివేతకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల సాధన కోసం ఈ యాత్ర చేపడుతున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ పిట్ల నర్సింహులు ముదిరాజ్, నియోజకవర్గ అధ్యక్షుడు రామస్వామి, నాయకులు భాను, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment