నీటి వృథాను అరికట్టండి
ధారూరు: సాగునీరు అడవి పాలు అనే శీర్షికన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి గురువారం వికారాబాద్ ఇరిగేషన్ ఈఈ మధుసూదన్‌రెడ్డి స్పందించారు. కోట్‌పల్లి ప్రాజెక్టు బేబీ కెనాల్‌పై ఉన్న కల్వర్టు దెబ్బతినడంతో పంట పొలాలకు వెళ్లాల్సిన నీరు వృథాగా అడవిలోకి వెళుతోంది. ఈఈ ఆదేశాలతో తూము షట్టర్‌ను ఇరిగేషన్ సిబ్బంది తాత్కాలికంగా మూసివేశారు. దెబ్బతిన్న కల్వర్టును బాగు చేయించిన తర్వాత నీటిని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. 15 రోజుల నుంచి నీరు వృథా పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇరిగేషన్ ఈఈ మధుసూదన్‌రెడ్డి
కోట్‌పల్లి బేబీ కెనాల్ తూమును మూసేసిన సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment