కొత్త మెనూ అమలు చేయండి
● కలెక్టర్ ప్రతీక్ జైన్
అనంతగిరి: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు కొత్త మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం వడ్డించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం వికారాబాద్‌లోని కలెక్టరేట్‌లో ఎస్సీ, బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖల జిల్లా అధికారులతో కొత్త మెనూ అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త మెనూ విధిగా అమలు చేయాలని, విద్యార్థులకు రుచికరమైన భోజనం వడ్డించాలని ఆదేశించారు. వసతి గృహాల్లో చిన్నచిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. తాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్స్, కిటికీలు, తలుపులను సరి చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 700 శునకాలకు జనన నియంత్రణ ఆపరేషన్లు చేయించినట్లు వివరించారు. వీధి కుక్కలను పట్టుకోవడానికి ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తులను నియమించామని తెలిపారు. సమావేశంలో అదన పు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, డీఆర్‌డీఓ శ్రీనివాష్, ఎస్సీ, బీసీ, గిరిజిన, మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు మల్లేశం, ఉపేందర్, కమలాకర్ రెడ్డి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment