లగచర్ల కేసులు ఎత్తివేయాలి
దుద్యాల్: లగచర్ల ఘటనలో రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ లగచర్ల, హకీంపేట్ గ్రామాల నాయకులు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. గురువారం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో సమావేశమై ఈ మేరకు విన్నవించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గత ఏడాది నవంబర్ 11న లగచర్ల ఘటనలో రైతులపై ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అనుకోకుండ జరిగిన ఘటనలో చాలా మంది అమాయక రైతులు కేసుల్లో ఇరుక్కున్నారని, వారి కుటుంబాల బాధను చూడలేక మీ వద్దకు వచ్చినట్లు తెలిపారు. కేసులు ఎత్తివేయాలని కోరారు. అలాగే పారిశ్రామిక వాడ కోసం భూములు ఇచ్చే రైతులకు పరిహారం పెంచాలని కోరారు. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. కొంతమంది ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. అలాంటి వారితో మాట్లాడి అపోహలు తొలగించాలని సీఎం సూచించినట్లు చెప్పారు. రైతులతో మాట్లాడి అభివృద్ధికి సహకరించేలా చూడాలని అన్నట్లు తెలిపారు. కొత్తగా ఏర్పడిన దుద్యాల్ మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో లగచర్ల మాజీ సర్పంచ్ అనంతయ్య, కాంగ్రెస్ పార్టీ దుద్యాల్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్, హకీంపేట్ మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, లగచర్ల ఎంపీటీపీ మాజీ సభ్యుడు రవికుమార్, నాయకుడు యుగంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డిని కోరిన లగచర్ల, హకీంపేట్ నాయకులు
రైతు కుటుంబాల బాధ చూడలేకే మీ వద్దకు వచ్చాం
భూ పరిహారం పెంచాలని విన్నపం
ముఖ్యమంత్రి సానుకూలంగాస్పందించినట్లు వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment