‘పారిశ్రామిక వాడ’కు భూ సర్వే
దుద్యాల్: లగచర్ల ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఫార్మాసిటీకి బదులుగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంకల్పించింది. ఇందులో భాగంగా మండల పరిధిలోని హకీంపేట్, పోలేపల్లి, లగచర్ల, రోటిబండ తండా, పులిచర్లకుంట తండాలలో ఏర్పాటు చేయదలిచిన పారిశ్రామిక వాడకు భూ సేకరణ పనులు ముమ్మరం చేశారు. మంగళవారం మండల పరిధిలోని హకీంపేట్ గ్రామానికి చెందిన 351 ఎకరాలకు కొడంగల్ తహసీల్దార్ విజయ్ కుమార్, దుద్యాల్ తహసీల్దార్ కిషన్ ఆధ్వర్యంలో సర్వే ప్రారంభించారు. పట్టదారుడు వద్ద సర్వే నంబర్ ప్రకారం వారి భూమి మూలాలను గుర్తిస్తున్నారు. ప్రస్తుతం పట్టా పాసుపుస్తకంలో ఉన్న పొజీషన్‌లోనే ఉన్నారా లేదా అని సర్వే ఆధారంగా గుర్తిస్తున్నారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే సర్వేకు ముగ్గురు సర్వేయర్లకు ముగ్గురు ఆర్‌ఐలను కేటాయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వీరేశ్‌బాబు, ఆర్‌ఐలు నవీన్, రాఘవేందర్, వేణు రెవన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
పర్యవేక్షిస్తున్న కొడంగల్, దుద్యాల్ తాహసీల్దార్‌లు
Comments
Please login to add a commentAdd a comment