ఏడాది
అభయహస్తం దరఖాస్తులకు
వికారాబాద్: ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయ హస్తం పేరిట గత ఏడాది జనవరి మొదటి వారంలో ప్రజల నుంచి ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తులు స్వీకిరంచారు. అర్జీలు తీసుకొని ఏడాదైనా కేవలం రెండు గ్యారంటీలను మాత్రమే అమలుకు నోచుకున్నాయి. మిగతావి ఎప్పుడు అమలు చేస్తారనే విషయంపై స్పష్టత లేదు. ఇందులో రైతు భరోసా సంక్రాంతి పండుగ కానుకగా అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. మరో గ్యారంటీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సర్వే చేస్తున్నా అవి ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయం తెలియడం లేదు. మహాలక్ష్మి, చేయూత పథకాల ఊసే లేదు. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కుటుంబాల సంఖ్య కంటే అర్జీలే ఎక్కువగా వచ్చాయి. జిల్లాలోని 18 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల్లో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు.
ఐదు గ్యారంటీల కోసం..
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయుత పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథాకలు అమలు చేస్తున్నారు.
అంచనాలకు మించి అర్జీలు
ఆరు గ్యారంటీల కోసం అంచనాలకు మించి దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో మొత్తం 1,94,956 కుటుంబాలు ఉండగా 3,14,090 అర్జీలు వచ్చాయి. ఇందులో ఐదు గ్యారంటీలకు సంబంధించి 2,74,470 వచ్చాయి. రేషన్ కార్డులు, భూ సమస్యలకు సంబంధించి 39,620 దరఖాస్తులు వచ్చాయి. ప్రత్యేక ఏర్పాటైన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవటం, ధరణికి సంబంధించి వేల సంఖ్యలో సమస్యలు పేరుకుపోవడం వంటి సమస్యలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయి. ఐదు గ్యారంటీల కోసం తాండూరు మున్సిపాలిటీలో అత్యధికంగా 17,065 ధరకాస్తులు రాగా వికారాబాద్ మున్సిపాలిటీ, దోమ, బొంరాస్‌పేట్ మండలాల్లో 16 వేలకు పైగా అర్జీలు వచ్చాయి. కొడంగల్ మున్సిపల్ పరిధిలో అత్యల్పంగా 3,414 దరఖాస్తులు వచ్చాయి.
గత ఏడాది జనవరి మొదటి వారంలో అర్జీల స్వీకరణ
ఆరు గ్యారంటీల్లో అమలుకు నోచుకుంది రెండే
జిల్లాలో మొత్తం కుటుంబాలు 1,94,956
వచ్చిన దరఖాస్తులు 3,14,090
ఐదు గ్యారంటీలకు వచ్చినవి 2,74,470
Comments
Please login to add a commentAdd a comment