స్పీకర్‌ను కలిసిన ట్రెసా ప్రతినిధులు
అనంతగిరి: శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను ఆదివారం తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు నగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, సంయుక్త కార్యదర్శి మనోహర్ చక్రవర్తి, జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి విజయేందర్, శ్రీనివాస్‌రెడ్డి, మునీరుద్దీన్, విజయ్‌కుమార్, సురేశ్‌కుమార్, విజయ్, బాలరాజు, నరేందర్, రవి కిషోర్, పాండు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment