ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ మహిళా శక్తి ద్వారా మైనార్టీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందించనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి నవీన్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. నిరుపేద నిరాశ్రయులు, వితంతువు, విడాకులు తీసుకున్న మహిళలు అనాథ, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. తెల్ల రేషన్‌కార్డు, ఆహారభద్రత కార్డు రెండు లేకపోతే గ్రామీణ ప్రాంతం వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతం వారికి రూ.2 లక్షలు ఆదాయం మించకూడదన్నారు. వయస్సు 21 నుంచి 55 సంవత్సరాలు మించరాదన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదా ప్రభుత్వ గుర్తింపుపొందిన సంస్థ ద్వారా నేర్చుకున్న టేలరింగ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందన్నారు. కనీసం 5వ తరగతి విద్యార్హత కలిగి ఉండలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment