మున్సిపాలిటీలకు కేంద్రం చేయూత
కొడంగల్: మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం చేయూత ఇస్తోందని.. ఇందులో భాగంగా అమృత్ 2 పథకం కింద కొడంగల్‌కు రూ.4.5 కోట్లు మంజూరు చేసినట్లు ఎంపీ డీకే అరుణ తెలిపారు. మంగళవారం పట్టణంలోని కార్గిల్ కాలనీ సమీపంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డితో కలిసి అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాగునీటి సమస్య పరిష్కారానికి అమృత్ 2 పథకం కింద నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్, పట్టణాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రధాని మోదీ ఉద్దేశమన్నారు. ఇందులో భాగంగానే ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్లు, రైతు వేదికలు, వైకుంఠధామాలు నిర్మించినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నతంగా జీవించాలన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఉషారాణి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్, నాయకుడు పున్నం చంద్ తదితరులు పాల్గొన్నారు.
అమృత్ 2 పథకం కింద కొడంగల్‌కు రూ.4.5 కోట్లు మంజూరు
ఎంపీ డీకే అరుణ
అభివృద్ధి పనులకు భూమిపూజ
Comments
Please login to add a commentAdd a comment