మున్సిపల్ కార్మికుల ఆందోళన
తాండూరు టౌన్: తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్‌సింహా రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్‌లాలా దూషించడాన్ని నిరశిస్తూ మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. పారిశుద్ధ్య నిర్వహణపై కమిషనర్‌కు హబీబ్‌లాలా ఫోన్ చేయగా.. ఆయన లిఫ్ట్ చేయలేదు.. దీంతో పరుషపదజాలంతో దూషించినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆగ్రహించిన మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి అయినంత మాత్రాన ఇష్టానుసారంగా కమిషనర్‌ను దూషిస్తారా అంటూ కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు, కౌన్సిలర్ సోమశేఖర్ ఆందోళనకు మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారులు, నాయకుల మధ్య సమన్వయం ఉండాలన్నారు. అనంతరం కార్మిక సంఘం నాయకుడు గోపాల్ మాట్లాడుతూ.. కమిషనర్‌ను అకారణంగా దూషించడం సరి కాదన్నారు. అనంతరం మున్సిపల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కమిషనర్‌ను కలిసి కార్యాలయం ఎదుట నిరశన తెలిపారు. టీఎన్‌జీఓ ఆధ్వర్యంలో హబీబ్‌లాలాపై పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కార్మికులతో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే
విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కార్మికులతో ఫోన్‌లో మాట్లాడారు. కమిషనర్‌ను దూషించిన విషయం గురించి తాను రేపు మాట్లాడతానని హామీ ఇచ్చారు. యథావిధిగా పనులకు వెళ్లాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కార్మికులకు సూచించారు. దీంతో వారు విధులకు హాజరయ్యారు.
బీఆర్‌ఎస్ మద్దతు
మున్సిపల్ కార్మికులకు బీఆర్‌ఎస్ శ్రేణులు మద్దతు పలికారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ.. దౌర్జన్యాలకు దిగడం కాంగ్రెస్ పార్టీ డీఎన్‌ఏలోనే ఉందన్నారు. అధికారం ఉందని విర్రవీగితే ప్రజలు తిరగబడతారన్నారు. హబీబ్‌లాలాను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు నయీం, సలీం, వెంకట్‌రెడ్డి, శ్రీధర్, దత్తాత్రేయ, సందీప్ రెడ్డి తదితరులు ఉన్నారు.
మా భాష ఇట్లనే ఉంటది: హబీబ్‌లాలా
పట్టణంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది.. ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో కమిషనర్‌కు ఫోన్ చేశా.. ఆయన లిఫ్ట్ చేయలేదు. సాధారణంగా ఉపయోగించే భాషనే మాట్లాడాను.. దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు.. మా భాష ఇట్లనే ఉంటందని హబీబ్‌లాలా అన్నారు. అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంటే చూస్తూ ఎలా ఊరుకోవాలని ఆయన ఎదురు ప్రశ్నించారు.
కమిషనర్‌ను దూషించిన కాంగ్రెస్ నాయకుడు
సోషల్ మీడియాలో వైరల్ అయిన తిట్ల దండకం
చర్యలు తీసుకోవాలంటూ కార్మికుల ధర్నా
Comments
Please login to add a commentAdd a comment