11న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
దుద్యాల్: సంక్రాంతి పండుగ సందర్భంగా మండలంలోని హస్నాబాద్ జెడ్పీహెచ్‌ఎస్ మైదానంలో ఈ నెల 11న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు నరేశ్, శేఖర్, పవన్, శ్రీనివాస్, కృష్ణ, శ్రీకాంత్, అబ్బు, గోపాల్, గోవర్థన్ తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. పోటీల్లో పాల్గొనే జట్టు 10వ తేదీలోపు రూ.1000 ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. విజేత జట్టకు రూ.30 వేలు, రెండో స్థానంలో నిలిచే జట్టుకు రూ.20 వేలు, మూడో విజేతకు రూ.10 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు సెల్ నంబర్ 7989622670లో సంప్రదించాలని కోరారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతి రెడ్డి వస్తున్నట్లు తెలిపారు.
రేపు కబడ్డీ పోటీలు
అనంతగిరి: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9న సబ్ జూనియర్ లెవల్ బాలబాలికల టోర్నమెంట్, సెలక్షన్స్ జరుగుతాయని అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వినోద్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెలక్షన్స్ వికారాబాద్‌లోని బ్లాక్ గ్రౌండ్‌లో ఉంటాయన్నారు. 16 సంవత్సరాల లోపు వారు అర్హులన్నారు. గెలుపొందిన బాలబాలికలకు మొదటి బహుమతి రూ.10 వేలు, రెండో బహుమతి రూ.5 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
టీజీయూఎస్ జిల్లా అధ్యక్షుడిగా తిమ్యానాయక్
అనంతగిరి: తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా జరుపుల తిమ్యానాయక్ ఎన్నికయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేనావత్ రవికుమార్, గౌరవ అధ్యక్షుడిగా గోబ్రియా నాయక్, కోశాధికారిగా నీల్యానాయక్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేతావత్ గోవింద్ నాయక్ మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా గిరిజన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ముందుంటున్నట్లు తెలిపారు. గిరిజన ఉపాధ్యాయులు ఇన్‌సర్వీస్‌లో పీజీ చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అంబర్‌సింగ్ నాయక్, కోశాధికారి కృష్ణానాయక్, నాయకులు రమేష్ నాయక్, హీరాలాల్, బాబుసింగ్, హరిలాల్, గోపాల్, వెంకట్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు పాండునాయక్, హీర్యానాయక్, నర్స్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.
‘కళరిపయట్టు’లో సత్తా చాటిన విద్యార్థినులు
కొడంగల్ రూరల్: తెలంగాణ సాంస్కృతిక శాఖ, సింగిడి కల్చరల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో అంతర్జాతీయ కల్చరల్ ఫెస్ట్ నిర్వహించారు. ఇందులో కొడంగల్ జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన విద్యార్థినులు ప్రణవి, అర్చన, మాధవి, శివాని, కీర్తన కళరిపయట్టు విద్యలోని యుద్ధ విన్యాసాలతో అందరినీ అబ్బురపరిచారు. ఉత్తమ ప్రతిభ చాటి అవార్డులు అందుకున్నట్లు కళరిపయట్టు శిక్షకులు రమేష్ ఆచార్య తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలు వురు అభినందించారు.
నేడు చేవెళ్లలో
మంత్రుల పర్యటన
చేవెళ్ల: మండలంలో బుధవారం మంత్రుల చేతల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉండనున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. మండలంలోని ముడిమ్యాల నుంచి రావులపల్లి, మెడిపల్లి మీదుగా ప్రొద్దటూరు గేట్ వరకు వేసే రోడ్డుకు శంకుస్థాపన, చేవెళ్ల మండల కేంద్రంలో పీఏసీఎస్ గోదాం, పీఏసీఎస్ కార్యాలయ భవనాల ప్రారంభోత్సవాలు ఉంటాయని పేర్కొంది. ఆయా కార్యక్రమాలకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలిలో ప్రభుత్వ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరుకానున్నారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ఉంటుందని ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment