హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
మోమిన్‌పేట: ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆరోపించారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఎకరాకు రూ.15వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికే వానాకాలం, యాసంగి పెట్టుబడి సాయం అందిచలేదని.. ఇప్పుడు రూ.12వేలు ఇస్తామంటూనే సర్వేలు, డిక్లరేషన్‌లు పెడుతూ రైతులను గోసపెడుతున్నారని మండిపడ్డారు. రైతుబంధు నిధులు దుర్వినియోగం అయ్యాయని నిబంధనలు మారుస్తున్నామంటూ కాలయాపన తప్ప చేసిందేమీ లేదన్నారు. సంక్రాంతికి రైతు భరోసా, భూమి లేని కౌలు రైతులకు రూ.12వేలు, రేషన్‌కార్డుదారులకు జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామని మొండి చేయి చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ సబ్సిడీ ఒక నెలకే పరిమితం చేశారని ఆరోపించారు. ప్రతీ మహిళకు రూ.2,500 ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేసేంతవరకు బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్, పీఏసీఏస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీకాంత్, బీఆర్‌ఎస్ యువజన సంఘం మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, నాయకులు అజీజ్, భిక్షపతి, శ్రీరాములు, మైపాల్, అప్సర్, ఖాదర్, రాజు తదితరులు ఉన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఆనంద్
Comments
Please login to add a commentAdd a comment