హిందూ ధర్మం దేశానికి రామరక్ష
పరిగి: హిందూ ధర్మం, హిందూ జాతీయ వాదం దేశానికి శ్రీరామరక్ష అని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో ఆధ్యాత్మికవేత్త, సామాజిక, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ భాస్కరయోగి ఆధ్వర్యంలో నిర్వహించిన పుష్య సత్సంగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లో జరుగుతున్న ఘర్షణలు, అలజడులకు సనాతన ధర్మంలో పరిష్కారం దొరుకుతుందన్నారు. శాస్త్రాధారంగా జీవన విధానాన్ని కొనసాగించి ఆచార సంప్రదాయాలను అనుసరిస్తే భగవంతుడి కరుణ ఉంటుందన్నారు. దీంతో పరిపూర్ణ జీవితానికి అవకాశం ఉంటుందని చెప్పారు. సమర్ధుడైన గురువు ఆధ్వర్యంలోనే పరరిపూర్ణ జ్ఞానం వికసిస్తుందన్నారు. ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక వేత్త భాస్కరయోగి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, నాయకులు ప్రహ్లాద్‌రావు, శివరాజ్, బాలకృష్ణారెడ్డి, రామయాదవ్, పాండురంగాచారి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
Comments
Please login to add a commentAdd a comment