ఆమనగల్లు: ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఫోర్త్ సిటీ మీదుగా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి వరకు నిర్మించే ఎలివేటెడ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు మార్కింగ్ పనులు ప్రారంభమయ్యాయి. 41.5కిలో మీటర్లకు రెవెన్యూ శాఖ నుంచి నోటిఫికేషన్ జారీ చేయగా సర్వే పనులు పూర్తయ్యాయి. మండల పరిధిలోని ఆమనగల్లు, ఆకుతోటపల్లి రెవెన్యూ గ్రామాల్లో రోడ్డు నిర్మాణానికి భూ సేకరణ చేపట్టనున్నారు. ఆర్‌వీ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో సోమవారం రెవెన్యూ అధికారులు 330 అడుగుల రోడ్డు నిర్మాణానికి గాను ఆకుతోటపల్లిలో ఇరువైపులా మార్కింగ్ ఇస్తున్నారు. ఈ పనుల్లో కన్సల్టెన్సీ సిబ్బందితో పాటు ఆమనగల్లు తహసీల్దార్ లలిత, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సంపత్, సర్వేయర్ రవి పాల్గొన్నారు. ఆమనగల్లు సీఐ ప్రమోద్‌కుమార్, ఎస్‌ఐ వెంకటేశ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్కింగ్ పనులు మరో రెండు రోజుల సమయం పడుతుందని కన్సల్టెన్సీ సంస్థ వెల్లడించింది.
పనులు ఆపేయాలని వినతి
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పనులు ఆపాలని సాకిబండ తండాకు చెందిన పలువురు రైతులు కోరారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, ఆమనగల్లు తహసీల్దార్ లలితకు సోమ వారం ఆయా గ్రామాల రైతులు వినతిపత్రాలు అందజేశారు. ఈ రోడ్డు నిర్మాణంతో చిన్న, సన్నకారు రైతులకు చెందిన భూములనేకో ల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కున్న అర ఎకరా, ఎకరా భూములనురోడ్డు నిర్మాణంలో కోల్పోతే ఉపాధి లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పనులను ఆపి తమకు న్యాయం చేయాలని కోరారు. వినతిపత్రాలు ఇచ్చిన వారిలో రైతులు మనిపాల్, బోడ్య, చందర్, పాండు, రవిరాథోడ్, విజేందర్, రాజు, వినోద్, గోపి, శివరాం, కుమార్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment