10,00,032
జిల్లాలో ఓటర్ల సంఖ్య
● తుది జాబితాను విడుదల చేసిన కలెక్టర్ ప్రతీక్‌జైన్
అనంతగిరి: ప్రత్యేక ఓటరు నమోదు 2025లో భాగంగా ఓటరు తుది జాబితాను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రతీక్‌జైన్ విడుదల చేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్‌తో కలిసి సమావేశం నిర్వహించి జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 10,00,032 మంది ఓటర్లుగా నమోదైనట్లు తెలిపారు. ఇందులో 4,92,613 మంది పురుషులు, 5,07,644 మంది సీ్త్రలు, 45 మంది ఇతర ఓటర్లుగా నమోదయ్యారని పేర్కొన్నారు. పరిగి నియోజకవర్గంలో మొత్తం 2,71,060 మంది ఓటర్లు ఉండగా 1,35,522 మంది పురుషులు, 1,35,528 మంది సీ్త్రలు, 10 మంది ఇతరులు ఉన్నట్లు తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గంలో 2,34,933 మంది ఓటర్లు నమోదు కాగా 1,16,388 మంది పురుషులు, 1,18,524 మంది సీ్త్రలు, 21 మంది ఇతర ఓటర్లు ఉన్నారని చెప్పారు. తాండూరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,47,783 ఉండగా 1,19,824 మంది పురుషులు 1,27,952 మంది సీ్త్రలు ఏడుగురు ఇతర ఓటర్లు ఉన్నారని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలో 2,46,526 మంది ఓటర్లలో 1,20,879 పురుషలు, 1,25,640 మంది సీ్త్రలు, ఏడు ఇతర ఓట్లు ఉన్నట్లు వివరించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 549 సర్వీస్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. పరిగిలో 247, వికారాబాద్ 79, తాండూరులో 53, కొడంగల్‌లో 170 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. 1,133 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతోపాటు ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నేమత్ అలీ, డిప్యూటీ తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment