ఉత్సాహంగా ‘హరిత పరివారం’ సంబరాలు
కడ్తాల్: అన్మాస్‌పల్లి గ్రామ సమీపంలోని ఎర్త్ సెంటర్‌లో కౌన్సిల్‌ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో ఆదివారం ‘హరిత పరివారం ఆత్మీయ కుటుంబ సమ్మేళనం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదిహేనేళ్లుగా సీజీఆర్ సంస్థ ఆధ్వర్యంలో జయప్రదంగా నిర్వహించిన కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. భవిష్యత్ కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొంటూ కుటుంబ సమేతంగా ఆనందోత్సాహాల మధ్య సంబరాలు చేసుకున్నారు. ముగ్గుల పోటీలు, బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేశారు. భోగి మంటలు వేసి ఉత్సవాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో సీజీఆర్ చైర్‌పర్సన్ లీలా లక్ష్మారెడ్డి, వ్యవస్థాపకుడు లక్ష్మారెడ్డి, ఆచార్య పురుషోత్తంరెడ్డి, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ దిలీప్‌రెడ్డి, పర్యావరణవేత్త దొంతి నరసింహరెడ్డి, పర్యావరణ నిపుణులు శివప్రసాదరావు, తులసీరావు, ఇంధ్రసేనరెడ్డి, వెంకట్‌రెడ్డి, అన్నమయ్య, రాజేంధర్‌రెడ్డి, జ్ఞానేశ్వర్, ఉమామహేశ్వర్‌రెడ్డి, అనుదీప్, నగేశ్, కోటి, లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment