గడువు ముగుస్తున్నా.. కుదరని సయోధ్య
తాండూరు: మరో నాలుగు రోజుల్లో పదవీ కాలం ముగుస్తోన్న చైర్‌పర్సన్, కౌన్సిలర్ల మధ్య సయోధ్య కుదరడం లేదు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో చైర్‌పర్సన్ స్వప్న అధ్యక్షతన వార్డు సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు స్థానిక కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి, కౌన్సిలర్లు హాజరయ్యారు. సమావేశంలో బాల్‌రెడ్డి ప్రసంగిస్తూ.. బీఆర్‌ఎస్ హయాంలో అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే అభివృద్ధికి నిధులు కేటాయించామన్నారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి చిలుక వాగు ప్రక్షాళన పనులు చేయిస్తున్నారని అన్నారు. దీంతో వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెసోళ్లంతా దొంగలు.. చిలుకవాగు అభివృద్ధి పేరిట రూ.లక్షలను అక్రమాలకు పాల్పడ్డారంటూ కౌన్సిలర్ ఆరోపించారు. మరోవైపు తన వార్డులో జరిగే అభివృద్ధి పనులకు ప్రొటోకాల్ పాటించకుండా పనులు చేస్తున్నారన్నారు. దీంతో కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డికి మున్సిపల్ చైర్‌పర్సన్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పదవీకాలం ముగుస్తోన్న ప్రజాప్రతినిధులు మారడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెసోళ్లు దొంగలు అనడం పట్టణంలో చర్చనీయాంశశమైంది. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రంసింహారెడ్డి, కౌన్సిలర్‌లు, నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులున్నారు,
వార్డు సభలో చైర్‌పర్సన్, కౌన్సిలర్ల మధ్య గొడవ
Comments
Please login to add a commentAdd a comment