ప్రతి ఒక్కరికీ సంక్షేమం
పరిగి: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తామని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణ కేంద్రంలోని 8వ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితో కలసి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తుందని తెలిపారు. సీఎం రేంవంత్‌రెడ్డి పేద ప్రజల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా లక్ష 9వేల మంది రైతులకు రూ. 850 కోట్ల రుణమాఫీని ప్రభుత్వం అందించిందన్నారు. మహాలక్ష్మి పథకం కింద రంగారెడ్డి రీజియన్‌లో 2కోట్ల 70లక్షల మంది మహిళాలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించారని, ఇందుకోసం ప్రభుత్వం రూ.98 కోట్లు చెల్లించిందని తెలిపారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతిఒక్కరికీ పథకాలు అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, మున్సిపల్ చైర్మన్ ముకుందఅశోక్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంతుముదిరాజ్, పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తాండూరు అభివృద్ధికి నిధులు తెస్తా
తాండూరు రూరల్: తాండూరు అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెస్తామని చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. కరన్‌కోట్‌లో బుధవారం నిర్వహించిన గ్రామ సభలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. కరన్‌కోట్‌లో ఇంటి స్థలంలేని నిరు పేదలకు గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాగప్ప, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, మండల స్పెషలాఫీసర్ సత్తార్, డీఎల్‌పీఓ శంకర్‌నాయక్, తహసీల్దార్ తారాసింగ్, ఎంపీడీఓ విశ్వప్రసాద్, నాయకులు ఉత్తమ్‌చందు, శరణు బసప్ప, రాజ్‌కుమార్, జర్పప్ప, సుధకర్, వడ్డె శ్రీను, పురుషోత్తం రెడ్డి, జగదీష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి
అర్హ్హులకు పథకాలు: ఎమ్మెల్యే టీఆర్‌ఆర్
Comments
Please login to add a commentAdd a comment