మెరుగైన వైద్యం మన బాధ్యత
బొంరాస్‌పేట: ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం మన బాధ్యత అని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సీనియర్ ప్రాంతీయ సంచాలకులు డా.అనురాధ అన్నారు. బుధవారం బొంరాస్‌పేట పీహెచ్‌సీని ఆమె సందర్శించారు. వివిధ విభాగాలను పరిశీలించి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాల అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారు. పీహెచ్‌సీకి వచ్చే రోగుల వివరాలను డాక్టర్ హేమంత్‌ను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఇబ్బంది లేకుండా మరో డాక్టర్‌ను నియమించాలని డీఎంహెచ్‌ఓ వెంకటరమణకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఉపకేంద్రాలను తరచూ పరిశీలించాలని ఆదేశించారు. ఎన్‌క్వాస్, కాయకల్పకు పీహెచ్‌సీ ఎంపికై ందని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవీంద్రయాదవ్ వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ అక్షయ్, సీహెచ్‌ఓ శివరాజ్, సిబ్బంది పాల్గొన్నారు.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సీనియర్ ప్రాంతీయ సంచాలకులు డా.అనురాధ
Comments
Please login to add a commentAdd a comment