లాడ్జిలో మహిళ మృతదేహం
షాద్‌నగర్‌రూరల్: పట్టణంలోని ఓ లాడ్జిలో మహిళ మృతదేహం లభ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఫరూఖ్‌నగర్ మండలం కందివనం పంచాయతీ పిట్టలగడ్డతండాకు చెందిన శివలీల(35) భర్త చనిపోవడంతో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ప్రస్తుతం ఆమె నందిగామ మండల పరిధిలోని కన్హ శాంతివనంలో పని చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్‌కు చెందిన దేవదాస్ గతంలో లైన్‌మెన్‌గా పనిచేసేవాడు. అక్కడ ఓ మహిళ హత్య కేసులో జైలుకు వెళ్లడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో కొంతకాలంగా కన్హశాంతి వనంలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శివలీల, దేవదాస్‌లకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ నెల 20న బ్యాంకులో పని ఉందని చెప్పి ఇంటి నుంచి షాద్‌నగర్‌కు వచ్చిన శివలీల దేవదాస్‌తో కలిసి ఉదయం 10గంటల సమయంలో పట్టణంలోని సంగమేశ్వర లాడ్జికి వెళ్లింది. బుధవారం గదిలోంచి దుర్వాసన వస్తుండడంతో లాడ్జి నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అత్యాచారంగా అనుమానం
దుర్వాసన వస్తుండడంతో వెలుగులోకి వచ్చిన ఘటన
వివరాలు సేకరించిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment