ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి
శంకర్‌పల్లి: ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాల్సిందేనని కొండాపూర్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్(ఎంవీఐ) సునీతారెడ్డి అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా బుధవారం శంకర్‌పల్లి పట్టణంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణ చౌరస్తాలో మానవహారంగా నిల్చొని, ట్రాఫిక్ నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంవీఐ మాట్లాడుతూ.. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపొద్దని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ లైసెన్సు కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్, కారు నడిపేవారు సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని కోరారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి అక్బర్, ట్రైనీ ఎస్‌ఐ చంద్రశేఖర్, ఫిజికల్ డైరెక్టర్ అరుంధతి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కొండాపూర్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ సునీతారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment