![ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05sdnr101-640014_mr-1738806324-0.jpg.webp?itok=qjFYzHkU)
ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
షాద్‌నగర్‌రూరల్: ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సభ్యురాలు భవాని సూచించారు. బుధవారం గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో రెడ్ రిబ్బన్ క్లబ్, ఎన్‌ఎస్‌ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధిపై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భవాని మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతీ ఒక్కరికి ఎయిడ్స్‌వ్యాధిపై అవగాహన ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు వ్యాధి బారిన పడకుండా విద్యార్థులు వారిని చైతన్యవంతం చేయాలని సూచించారు. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలని అన్నారు. ఒకే సిరంజిని ఎక్కువ మందికి ఉపయోగించడంతో హెచ్‌ఐవీ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపకుండా వారిని చేరదీయాలని అన్నారు. సమాజాభివృద్దిలో భాగంగా ప్రతి విద్యార్థి విద్యతో పాటుగా సామాజిక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకోవాలని అన్నారు. ఆరోగ్య సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలే, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ సృజన, ఎన్‌ఎస్‌ఎస్ ఇన్‌చార్జి అఫ్రోజా, అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న భవాని
స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సభ్యురాలు భవాని
Comments
Please login to add a commentAdd a comment