![యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05klky408-640072_mr-1738806325-0.jpg.webp?itok=gdFh3Gj-)
యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం
ఆమనగల్లు: కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని టాస్క్ సీఈఓ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని టాస్క్ కార్యాలయంలో ఫ్యాక్స్‌కాన్ కంపెనీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో వెల్దండ మండలానికి చెందిన 16 మంది మహిళలు ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా రాఘవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో 3వేల మంది మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. జాబ్ రిక్రూమెంట్ డ్రైవ్స్‌ను నిరుదోగ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
టాస్క్ సీఈఓ రాఘవేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment