ఇబ్రహీంపట్నం రూరల్: నిబంధనలకు విరుద్ధంగా ఆర్‌ఎంపీ వైద్యులు చికిత్స చేస్తే సహించేది లేదని రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లిలో ఓ ప్రైవేటు క్లినిక్‌లో స్థాయికి మించిన వైద్యం చేస్తున్నారనే సమాచారంతో జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీ చేపట్టారు. కాలం చెల్లిన మందులు, సిరంజిలు, స్టిచ్చింగ్ సామగ్రి, మరికొన్ని నిషేధిత మందులు స్వాధీనం చేసుకున్నారు. అర్హతలు లేకున్నా చిన్న పిల్లలకు, గర్భిణులకు చికిత్స చేస్తున్నారని గుర్తించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకుంటామని, తాత్కాలికంగా క్లినిక్‌ను సీజ్ చేసినట్లు జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్, సరిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment