![వారంలో ఐదురోజులు కొనుగోళ్లు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06vkb97-360018_mr-1738893952-0.jpg.webp?itok=bfUI0eSb)
వారంలో ఐదురోజులు కొనుగోళ్లు
అనంతగిరి: వికారాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో వారంలో ఐదురోజులు కొనుగోళ్లు జరపాలని నిర్ణయించినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి ఫసియొద్దీన్, ది గ్రీన్ అండ్ సీడ్స్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు చిగుళ్లపల్లి రమేష్‌కుమార్ తెలిపారు. గురువారం మార్కెట్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు వారంలో రెండు రోజులు మాత్రమే రైతుల నుంచి పంట దిగుబడి కొనుగోలు చేసేవారని, ఇకపై ఆదివారం, మంగళవారం మినహాయించి మిగిలిన అన్ని రోజులు కొలుగోళ్లు చేపట్టనున్నట్లు వివరించారు. రైతుల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మార్కెట్‌లో ఈ–నామ్ పద్ధతిని కొనుగోళ్లు జరుగుతాయన్నారు. ఆన్‌లైన్ పద్ధతిన ఇతర ప్రాంతాల వ్యాపారులు సైతం టెండర్లు వేసి కొనుగోళ్లు చేస్తున్నందున రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు. ఇకనుంచి రైతులు పంట దిగుబడిని ఉదయం 11గంటల లోపు మార్కెట్ గేట్‌లోకి తీసుకురావాలని సూచించారు. మార్కెట్‌లో రూ. 2.30కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి హుమ్నాబాద్ రవి, సూపర్ వైజర్ సాయి తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఫసియొద్దీన్
Comments
Please login to add a commentAdd a comment