![ధాన్యం సేకరణకు సిద్ధం కావాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06vkb94-360018_mr-1738893952-0.jpg.webp?itok=fLVsIBRP)
ధాన్యం సేకరణకు సిద్ధం కావాలి
అనంతగిరి: రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉండాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అధికారులకు సూచించారు. గురువారం నగరం నుంచి పౌరసరఫరాల ముఖ్య కార్యదర్శి డి.ఎస్.చౌహన్ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులు, జిల్లా మేనేజర్లు, వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రబీ 2024 – 25 ధాన్యం సేకరణ, 2023 – 24 సీఎంఆర్ డెలివరీ, రేషన్ కార్డులు, మిల్లర్ల అసోసియేషన్ల బ్యాంకు గ్యారంటీ పత్రాల సమర్పణ తదితర అంశాలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. 2024 – 25 రబీ సీజన్లో 2,25,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా ఉందని, లక్ష టన్నులు సేకరించేందుకు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలన్నారు. 2023 – 24 ఖరీఫ్ సీఎంఆర్ వంద శాతం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు గోదాంలలో ధాన్యం నిలువలను పరిశీలిస్తూ ఉండాలన్నారు. రైస్ మిల్లర్ల నుంచి బ్యాంక్ గ్యారంటీ పత్రాలను తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి సరఫరా అవుతున్న బియ్యం దుర్వినియోగం కాకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మోహన్ బాబు, జిల్లా మేనేజర్ విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్
Comments
Please login to add a commentAdd a comment