బషీరాబాద్: సురీడు అప్పుడే సుర్రుమంటున్నాడు. శివరాత్రి కంటే ముందే జిల్లాలో ఎండలు మండుతున్నాయి. గురువారం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 37.50 డిగ్రీలుగా నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో ఉక్కపోత మొదలైంది. గతేడాది మార్చి నెలాఖరులో నమోదైన టెంపరేచర్ ఇప్పుడు ఫిబ్రవరి మొదటి వారంలోనే రికార్డు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడే ఎండలు 37 డిగ్రీలు దాటితే రాబోయే ఏప్రిల్, మే నెలల్లో రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశం లేకపోలేదని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఎండ తీవ్రతకు మధ్యాహ్నం రోడ్ల న్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. నిత్యం జనంతో రద్దీగా ఉండే ప్రాంతాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. పొలం పనులకు వెళ్లే వారు, గని కార్మికులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. శీతల పానియాలకు గిరాకీ పెరిగింది. జ్యూస్ సెంటర్ల వద్ద రద్దీ కనిపిస్తోంది.
ఉష్ణోగ్రతలు డిగ్రీలలో..
ప్రాంతం గరిష్టం కనిష్టం
యాలాల 37.5 18.2
మన్నెగూడ 37.5 15.2
కొడంగల్ 37.2 18
తొర్మామిడి 37.1 17.1
మర్పల్లి 37.4 15.9
వికారాబాద్ 36.8 17.8
ధారూరు 36.7 18.8
మోమిన్‌పేట్ 36.5 16.9
బంట్వారం 36.1 16
తాండూరు 35.9 17.9
దౌలాపూర్ 35.9 18.3
పెద్దేముల్ 35.5 16.8
నవాబుపేట 35.4 16.5
చౌడాపూర్ 35.2 15.7
దుద్యాల్ 34.2 16
కుల్కచర్ల 34.9 17
బషీరాబాద్ 34.9 17
బొంరాస్‌పేట 34.7 17.7
పరిగి 34.0 16.5
రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
యాలాల మండలంలో 37.5 డిగ్రీలు నమోదు
వారం రోజులుగా ఉక్కపోత
శీతల పానీయాలకు పెరిగిన గిరాకీ
Comments
Please login to add a commentAdd a comment