శంకర్‌పల్లి: భారతదేశ సంస్కృతి ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని ఐఐఎం (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్), కొజికోడ్ డైరెక్టర్‌దెబాషిశ్ ఛటర్జీ అన్నారు. దొంతన్‌పల్లిలోని ఇక్ఫాయ్ డీమ్డ్ యూనివర్సిటీ 15వ వ్యవస్థాపక దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరవగా ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ వర్చువల్‌గా పాల్గొన్నారు. ‘గ్లోబలైజేషన్ ఇండియన్ థాట్స్– ఇన్‌సైట్స్ ఫ్రం లీడర్‌షిప్ క్రానికల్స్’అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఛటర్జీ మాట్లాడుతూ.. భారతదేశంలోని విభిన్న సంస్కృతులు, భాషలు ప్రతి ఒక్కరికి ఎంతో పరిజ్ఞానాన్ని అందిస్తాయని, అందుకే ఎంతో మంది భారతీయులు విదేశాల్లో రాణిస్తూ గొప్ప పదవుల్లో కొనసాగుతున్నారని తెలిపారు. ప్రపంచంలోని పేరుగాంచిన సంస్థలన్నింటినీ భారతీయులే ముందుండి నడిపిస్తుండటం గర్వించదగిన విషయమన్నారు. ఏ నాయకుడికై నా ఓ పంథా అంటూ ఏమీ ఉండదని, ఎల్లప్పుడూ తన అనుచరులను ప్రొత్సహిస్తూ, ముందుకు సాగడమే నాయకుడి లక్షణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇక్ఫాయ్ సొసైటీ చైర్‌పర్సన్ శోభారాణియశస్వీ, వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఎల్‌ఎస్ గణేశ్, సంస్థ విశిష్ట సలహాదారుడు మహేందర్‌రెడ్డి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ బీజేరావు, రిజిస్ట్రార్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అనుచరులను ప్రోత్సహించడమే నాయకుల లక్షణం
ఐఐఎం, కొజికోడ్ డైరెక్టర్ దెబాషిశ్ ఛటర్జీ
Comments
Please login to add a commentAdd a comment