ముందడుగు | - | Sakshi
Sakshi News home page

ముందడుగు

Published Thu, Feb 6 2025 7:16 AM | Last Updated on Thu, Feb 6 2025 7:17 AM

ముందడ

ముందడుగు

గురువారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం

8లోu

వికారాబాద్‌: సీఎం సొంత నియోజకవర్గం దుద్యాల్‌ మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయ తలపెట్టిన మల్టీ పర్పస్‌ ఇండస్ట్రియల్‌ పార్కుకు ముందడుగు పడింది. అధికారుల ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. లగచర్ల, రోటిబండ తండా, పులిచర్లకుంట తండాల పరిధిలోని 1,358 ఎకరాల్లో పారిశ్రామికవాడ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రధానంగా మూడు రకాల భూములు(పట్టా, అసైన్డ్‌, ప్రభుత్వ) సేకరించాల్సి ఉంది. 547 ఎకరాల అసైన్డ్‌ భూమి, 90 ఎకరాల ప్రభుత్వ భూమి, 721 ఎకరాల పట్టా భూములు అవసరం. మొత్తం 800 మంది రైతులు భూములు కోల్పోనున్నారు. ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు ద్వారా 15వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. లగచర్ల ఘటన నుంచి ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటుండంతో అధికారులు తిరిగి భూ సేకరణ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సారి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఒకే సారి మొత్తం భూమిని సేకరించకుండా ముందుగా అసైన్డ్‌ భూమిని గ్రామాల వారీగా సేకరిస్తున్నారు. ఈ విషయంలో అధికారులు దాదాపు సక్సెస్‌ అయ్యారు.

ప్రస్తుత పరిహారం ఇలా..

ప్రస్తుతం ఎకరా అసైన్డ్‌ భూమికి రూ.20 లక్షలు చెల్లిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ – చించోలి హైవేకు పక్కనే అభివృద్ధి చేసే డీటీసీపీ అప్రూవ్‌డ్‌ లేఅవుట్‌లో ఎకరాకు 150 గజాల ప్లాటు ఇవ్వనున్నారు. ఎకరా కంటే తక్కువ ఉన్నా.. ఐదారు గుంటల భూమిని కోల్పోయినా 75 గజాల ప్లాటు ఇవ్వనున్నారు. ఒక్కో ప్లాటు మార్కెట్‌ విలువ రూ.15లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నారు. అర్హతను బట్టి ఇంటికో ఉద్యోగం ఇవ్వనున్నట్టు అధికారులు చెప్పారు. అయితే పట్టా, అసైన్డ్‌ భూములకు కూడా ఒకే తరహా పరిహారం ఇస్తామని అధికారులు చెబుతుండగా ఇందుకు తాము అంగీకరించబోమని పట్టా భూముల రైతులు పేర్కొంటున్నారు.

గ్రామాల వారీగా భూ సేకరణ ఇలా..

దుద్యాల్‌ మండలం పోలేపల్లిలో 71.27 ఎకరాల అసైన్డ్‌ భూమి సేకరించారు. 38 మంది రైతులు భూములు కోల్పోనున్నారు. కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, అడిషనల్‌ కలెక్టర్‌ లింగ్యానాయక్‌ పలు సార్లు రైతులతో సమావేశమై వారిని ఒప్పించారు. పరిహారం కూడా అందజేశారు.

హకీంపేటలో..

ఈ గ్రామంలో 351.10 ఎకరాల అసైన్డ్‌ భూమిని సేకరించాలని అధికారులు గుర్తించారు. 218 మంది రైతులు భూములో కోల్పోనున్నారు. వీరితో కలెక్టర్‌ ఆధ్వర్యంలోని అధికారుల బృందం పలు మార్లు సమావేశమై చర్చించారు. దీంతో రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించారు. వారం రోజుల్లో ఈ గ్రామ రైతులకు కూడా పరిహారం ఇవ్వనున్నారు.

లగచర్లలో..

లగచర్ల రెవెన్యూ గ్రామంలో 156.5 ఎకరాల అసైన్డ్‌ భూమి సేకరించాల్సి ఉంది. 93 మంది రైతులు భూములు కోల్పోనున్నారు. ఇక్కడి రైతులతో కూడా అధికాలు చర్చించారు. 70శాతం మంది భూములు ఇచ్చేందుకు అంగీకరించారు. మిగతా వారితో చర్చలు కొనసాగిస్తున్నారు. త్వరలో మిగిలిన వారు కూడా ఒప్పుకుంటారనే నమ్మకం ఉందని అధికారులు అంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే పట్టా భూముల రైతులను ఒప్పించాల్సి ఉంటుంది. అది కూడా పూర్తయితే ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఉన్న అడ్డుంకులన్నీ తొలగిపోయినట్లే.

అసైన్డ్‌ భూముల సేకరణ దాదాపు పూర్తి

ఇండస్ట్రియల్‌ పార్కు కోసం మూడు రెవెన్యూ గ్రామాల పరిధిలో 547 ఎకరాలు అసైన్డ్‌ భూమి, 721 ఎకరాల పట్టా భూమిని సేకరించాల్సి ఉంది. ప్రస్తుతం అసైన్డ్‌ భూముల సేకరణ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. ఇదే సమయంలో పట్టా భూములు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ ఆధ్వర్యంలో రైతులతో చర్చలు జరుపుతున్నారు. కొంత మంది రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని అధికారులు తెలిపారు.

హాజరైన భూ బాధితులు

న్యూస్‌రీల్‌

అసైన్డ్‌ భూముల సేకరణ దాదాపు పూర్తి

పరిహారం పెంపుతో రైతుల ఆసక్తి

పోలేపల్లి రైతులకు పరిహారం అందజేత

వారం రోజుల్లో హకీంపేట రైతులకు..

లగచర్లలోనూ 70 శాతం మంది అంగీకారం

త్వరలో పట్టా భూముల రైతులతో చర్చలు

పరిహారం పెంచి ఇస్తున్న ప్రభుత్వం

2012 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలనే నిబంధన ఉన్నా ఇంకాస్త పెంచి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే విషయాన్ని అధికారులు రైతులకు తెలిపారు. ఆ ప్రాంతంలో భూమికి ప్రభుత్వ విలువ ఎంత ఉంటుందో దానికి మూడింతలు పరిహారం ఇవ్వాలని 2012 భూ సేకరణ చట్టం చెబుతోంది. దుద్యాల్‌ మండలంలో ఎకరా భూమికి ప్రభుత్వ విలువ రూ.2.25 లక్షలుగా ఉంది. ఈ లెక్కన ఎకరాకు రూ.6.75 లక్షల పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. బహిరంగ మార్కెట్‌లో ఎకరా భూమి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు పలుకుతోంది. అయితే ఎకరాకు రూ.10 లక్షల పరిహారం, రూ.6 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు, అర్హతను బట్టి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం, ఎకరాకు 125 గజాల ప్లాటు ఇవ్వాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
ముందడుగు1
1/3

ముందడుగు

ముందడుగు2
2/3

ముందడుగు

ముందడుగు3
3/3

ముందడుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement