బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం
కొడంగల్ రూరల్: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బుస్స చంద్రయ్య ఆరోపించారు. బుధవారం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్ర బడ్జెట్ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజానికానికి, వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ పథకానికి నిధుల కొరత విధించిందన్నారు. బీమా రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం చూస్తోందని, వ్యవసాయ రంగాన్ని బడ్జెట్‌లో పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. విద్య, వైద్యం, తాగునీరు, రోడ్లు తదితర రంగాలకు నిధుల్లో కోత విధించిందన్నారు. కార్యక్రమంలో నాయకులు మైసప్ప, అనంతయ్య, మంగమ్మ, వెంకటమ్మ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు చంద్రయ్య
Comments
Please login to add a commentAdd a comment