అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొన్న ఆటో
యాలాల: ఆటో అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని రసూల్‌పూర్ హనుమాన్ ఆలయ సమీపంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్‌ఐ గిరి తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం జినుగుర్తికి చెందిన దాసు తన ఆటోలో ముగ్గురు ప్రయాణికులతో లక్ష్మీనారాయణపూర్ నుంచి తాండూరు వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో రసూల్‌పూర్ సమీపంలోకి రాగానే ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కన స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో దాసుతో పాటు పాత తాండూరుకు చెందిన నజీర్, నసీమా, సత్యనారాయణలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
నలుగురికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment