మార్కెట్ కమిటీని
షాబాద్: సర్ధార్‌నగర్ మార్కెట్ కమిటీని జిల్లాలోనే ఆదర్శ మార్కెట్ కమిటీగా అభివృద్ధి చేయాలని వ్యవసాయ మార్కెట్ రాష్ట్ర కమిటీ డైరెక్టర్ లక్ష్మీబాయి సూచించారు. బుధవారం నగరంలోని మార్కెటింగ్ కార్యాలయంలో సర్ధార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్‌రెడ్డి ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మీబాయి మాట్లాడుతూ.. జిల్లాలో అతిపెద్దదయిన సర్ధార్‌నగర్ మార్కెట్ కమిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని చైర్మన్ సురేందర్‌రెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి మహ్మద్ రియాజ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment