ఘాటెక్కిన వెల్లుల్లి
● బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.400 ● డీసీఎంఎస్ కౌంటర్లలో కిలో రూ. 310
సీతమ్మధార: వంటింటి సరకులు సామాన్యులకు భారంగా మారిపోతున్నాయి. అసలు వంట చేయాలంటేనే గృహిణులు భయపడిపోతున్నారు. ప్రతి కూరలో వినియోగించే వెల్లుల్లి ధరలు మండిపోతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం కిలో వెల్లుల్లిపాయల ధర రూ.400 వరకు పలుకుతోంది. పెరిగిన ధరల భారంతో ఆహారం నుంచి వెల్లుల్లి కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. దిగుబడులు తగ్గడం వల్లనే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. రైతుబజార్లలో వెల్లుల్లిపాయలు కిలో రూ.290లకు, అక్కడే ఉన్న డీసీఎంఎస్ కౌంటర్లలో రూ.310 చొప్పున విక్రయిస్తున్నారు. కొద్దిరోజులుగా రైతుబజార్లలో విక్రయిస్తున్న వెల్లుల్లిపాయలు నాసిరకంగా ఉంటున్నాయని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా మార్కెటింగ్‌శాఖ, పౌరసరఫరాలశాఖ అధికారులు స్పందించి ధరలు నియంత్రించే చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment