స్తంభం పై నుంచి పడి జూనియర్ లైన్‌మన్ దుర్మరణం
మధురవాడ : విద్యుత్తు స్తంభం పైనుంచి జారిపడి జూనియర్ లైన్‌మన్ మృతి చెందారు. ఈ ఘటన జోన్–3 కొమ్మాది విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పీఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి 7.30 గంటలకు కొమ్మాది విద్యుత్ సబ్‌స్టేషన్ పరిఽధి మారికవలస టయోటా షోరూం ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ బ్రేక్ డౌన్ అయింది. సమాచారం అందుకున్న జూనియర్ లైన్‌మన్ బలివాడ వెంకటేష్(37) అక్కడకు చేరుకొని విద్యుత్ స్తంభం ఎక్కి పనులు పూర్తి చేశాడు. కిందకి దిగే క్రమంలో స్తంభం పైనుంచి జారి పడిపోయాడు. తలకు తీవ్రమైన గాయం కావడంతో సహచర సిబ్బంది సమీపంలోని గాయత్రి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. మృతుడి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని హరిపురం. కొన్నాళ్ల క్రితం లక్ష్మిమనోహరితో వివాహం జరిగింది. ఐదేళ్ల నుంచి కొమ్మాది సెక్షన్లో జూనియర్ లైన్‌మన్‌గా విధులు నిర్వహిస్తూ రిక్షా కాలనీలో నివాసం ఉంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. సెక్షన్లో మంచి ఉద్యోగిగా పేరు సంపాదించుకున్న వెంకటేష్ మరణంతో సహచర సిబ్బంది, విద్యుత్ శాఖ అఽధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment