మహారాణిపేట: రాజమహేంద్రవరం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని రీచ్‌ల నుంచి ఇసుక బుక్ చేసుకునేందుకు జిల్లా యంత్రాంగం అవకాశం కల్పించింది. ఇసుకకు సంబంధించిన వివరాలు, ఫిర్యాదుల నమోదుకు జిల్లా ఇసుక సౌకర్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయి టోల్ ఫ్రీ నంబర్ 1800–599–4599, జిల్లా స్థాయి టోల్ ఫ్రీ నంబర్ 1800–425–6017కు ఫిర్యాదులు చేయవచ్చు. dmgapsand complaints@yahoo. com, vspdmgosand complaints@yahoo. comకు కూడా మెయిల్ చేయవచ్చని ఇసుక కమిటీ మెంబర్ కన్వీనర్ తెలిపారు. వివరాలకు 0891– 2590100, 0891–2590102కు సంప్రదించవచ్చు.
ఇసుక బుకింగ్ ఇలా..
● ఇసుక అవసరమైన వ్యక్తులు, కాంట్రాక్టర్లు https://sand.ap.gov.in లో ఆధార్ నంబర్‌తో నమోదు చేసుకోవాలి. నమోదు అయిన తర్వాత సాధారణ వినియోగం కోసం ఉచిత ఇసుక రవాణా సమాచార పత్రం లభిస్తుంది.
● ఎక్కడ నుంచి ఇసుక కావాలి, అర్బన్/రూరల్, మండలం/మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ/వార్డు, గ్రామం/సెక్రటేరియట్, బిల్డింగ్ అనుమతి సంఖ్య, బిల్డింగ్ విస్తీర్ణం (ఎస్‌ఎఫ్‌టీ) సైట్ వివరాలన్నీ పోర్టల్‌లో నమోదు చేయాలి.
● పోర్టల్‌లో అధీకృత సరఫరా పాయింట్ వద్ద నమోదు చేసుకున్న తర్వాత ఉచిత ఇ–ట్రాన్సిట్ ఫారాన్ని పొందాలి.
● ఇ–ట్రాన్సిట్ ఫారం/పర్మిట్ కలిగి ఉన్న వినియోగదారులు సొంతంగా లేదా డీఎంజీ వెబ్‌సైట్‌లో అందించిన విధంగా రిజిస్టర్డ్ వాహన జాబితా నుంచి పరస్పరం అంగీకరించిన ఖర్చుతో రవాణా చేసుకోవచ్చు. రవాణా చార్జీలు వినియోగదారులు నేరుగా రవాణాదారులకు చెల్లించాలి.
● వినియోగదారుడు/ రవాణాదారు ఇసుక సరఫరా కేంద్రాన్ని సంప్రదించి, ఇన్‌చార్జి నుంచి డెలివరీ తేదీ, సమయ స్లాట్‌ను తీసుకోవాలి.
● ట్రాన్స్‌పోర్టర్ నిర్ణీత స్లాట్‌లో రీచ్‌ను చేరుకోవాలి. సొంత లేబర్‌తో నేరుగా రీచ్ నుంచి లోడ్ చేసుకోవచ్చు లేదా నిర్ధిష్ట సప్లై పాయింట్ కోసం డీఎల్‌ఎస్‌సీ ఎంచుకున్న ఏజెన్సీ నుంచి సహాయం తీసుకోవచ్చు.
● ఇసుక రవాణా వాహనాలకు ‘ఉచిత ఇసుక రవాణా వాహనం’ బ్యానర్‌తో పాటు జీపీఎస్ అమర్చాలి.
Comments
Please login to add a commentAdd a comment