కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ
మహారాణిపేట: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించడానికి సిద్ధం కావాలని సంయుక్త కలెక్టర్ కె.మయూర్ అశోక్ సూచించారు. ఎండాడ జిల్లా వ్యవసాయ అధికారి వారి సమావేశ మందిరంలో ధాన్యం కొనుగొలు కేంద్రాల సిబ్బంది గురువారం ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులకు జేసీ హాజరై పలు సూచనలు చేశారు. కళ్లాల్లోని ధాన్యం, తేమ శాతం కనుగోనే సాంకేతిక పరిజ్ఙానాన్ని వినియోగించుకోవాలన్నారు. గతంలో మాదిరి కొనుగోలు మిల్లులు వద్ద తేమ శాతం వ్యత్యాసానికి అవకాశం లేకుండా సంబంధిత పరికరాలు సిద్ధం చేశామన్నారు. కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులకు వెళ్లే వరకు జీపీఎస్ ద్వారా పర్యవేక్షించునట్టు చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నిబద్ధతతో వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో 40 రైతు సేవ కేంద్రాలను 10 క్లస్టర్లుగా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రబీ 2024–25 సీజన్‌లో వరి పంట సాగు తగ్గించి చిరుధాన్యాల సాగు ప్రోత్సహించాలన్నారు. ముఖ్యంగా రాగి పంట సాగును ప్రొత్సహిస్తూ సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ జిల్లా కార్యాలయంలో ఉన్న ప్రకృతి వ్యవసాయ కార్యాలయం, పురుగు మందుల పరీక్ష కేంద్రం, జీవీ నియంత్రణ పరీక్ష కేంద్రం, సంచార భూసార పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కె.అప్పలస్వామి, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, జిల్లా పౌరసరఫరాల అధికారి వి.భాస్కరరావు, మార్కెఫెడ్ జిల్లా మేనేజర్ రమేష్, వ్యవసాయ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, గ్రామ వ్యవసాయ, ఉద్యాన విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment