సహకార రంగం బలోపేతమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సహకార రంగం బలోపేతమే లక్ష్యం

Published Fri, Nov 15 2024 1:14 AM | Last Updated on Fri, Nov 15 2024 1:14 AM

సహకార రంగం బలోపేతమే లక్ష్యం

సహకార రంగం బలోపేతమే లక్ష్యం

విశాఖ విద్య: పేద, మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవడం ద్వారా సహకార శాఖను బలోపేతం దిశగా తీసుకు వెళ్లాలని జిల్లా సహకార శాఖ అధికారి టి. ప్రవీణ అన్నారు. 71వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా గురువారం విశాఖ నగరంలోని మర్రిపాలెంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కేంద్ర కార్యాలయ ప్రాంగణంలో సీఈవో డీ.వీ.ఎస్‌.వర్మతో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రవీణ మాట్లాడుతూ వికసిత్‌ భారత్‌ లక్ష్యాల సాధనలో భాగంగా సహకార సంఘాలు మరింత ఆర్థిక పురోభివృద్ధి చెందాలన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకునే విషయంలో సహకార శాఖ కీలక పాత్ర పోషించాలన్నారు. బ్యాంకు సీఈవో డీ.వీ.ఎస్‌. వర్మ మాట్లాడుతూ డీసీసీబీ కార్యకాలపాలను విస్తృత ప్రచారం కల్పించేలా సహకార వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. సహకార సంఘాలను కంప్యూటరీకరణ చేసి, సేవలు మరింత వేగంగా అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ లెక్చరర్‌ జి. సోమేశ్వరరావు, బ్యాంకు జీఎం బి.శ్రీనివాసరావు, డీజీఎం అశోక్‌ కుమార్‌, ఏజీఎం యం. శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా సహకారశాఖ అధికారి ప్రవీణ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement