ఉద్యోగులకు షాక్‌లపై షాక్
స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు యాజమాన్యం ఎప్పటికప్పుడు షాక్‌లిస్తూనే ఉంది. ఏకంగా 115 శాతం వరకూ జీతం బకాయిల్లో ఉండటంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొన్ని నెలల నుంచి ఆర్థిక సమస్యల పేరుతో జీతాన్ని నెలలో రెండు విడతల్లో యాజమాన్యం చెల్లిస్తోంది. మొదటి వారంలో 50 శాతం నెలలో చివరి వారంలో మరో 50 శాతం చెల్లిస్తోంది. అయితే ఇప్పటికే సెప్టెంబర్ సంబంధించి 50 శాతం జీతం పెండింగ్‌లో ఉంది. దీంతో పాటు అక్టోబర్ నెల జీతం నుంచి తొలివిడతలో 50 శాతం ఇవ్వకుండా కేవలం 35 శాతాన్ని ఈ నెల మొదటి వారంలో చెల్లించారు. రెండో విడత చెల్లించాల్సిన మరో 50 శాతం ఇంకా పెండింగ్‌లో ఉంది. అంటే మొత్తం 115 శాతం జీతం బకాయిగా ఉండటంతో ఉద్యోగులు విలవిల్లాడుతున్నారు. ఎన్ని కుయుక్తులు పన్నుతున్నా వెరవకుండా ఏళ్లతరబడి ఉద్యమాలు చేసి స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునేందుకు శ్రమిస్తున్న ఉద్యోగులు, కార్మికుల ఆర్థిక మూలాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దెబ్బకొడుతున్నాయి. పోరాటం చేస్తున్న వారి ఆత్మస్థైర్యాన్ని, ఆర్థిక ఆసరాని ఛిద్రం చేస్తే.. ఉద్యమాన్ని నీరుగార్చొచ్చన్న కుతంత్రంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విషయం.. జీతాల చెల్లింపులతో బట్టబయలవుతోంది. దీనిపై నిలదీసేందుకు ఉద్యోగులు ప్రయత్నించినా ఉన్నతాధికారులు ఎవరూ స్పందించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment